విశ్వాసి పారుపాటున పాపములో పడితే ఏమి చేయాలి ?
◆ విశ్వాసిని పారుపాటున పాపములో పడితే ఏమి చేయాలి? ఒక విశ్వాసిని ఎక్కువ బాధపెట్టేది మరియు భయపెట్టేది శరీరానికి తగిలిన గాయం కాదు, ఆస్తి నష్టం కాదు, డబ్బులు పోవటం కాదు, మనుషులు ఒంటరిచేసి విడిచిపెట్టడం కానేకాదు. ఒక విశ్వాసి ఎక్కువ బాధపడేది , బాధపడేది కేవలం తాను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టియే. పాపము వల్ల తాను ప్రేమించిన దేవుని మనస్సును గాయపరిచానని విశ్వాసి ఎక్కువ బాధపడతాడు. మరి అట్టి సమయంలో విశ్వాసి ఏమి చేయాలో రెండు విషయాలు తెలుసుకుందాము❖ పాపం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకోవాలి... ✔ మన పాపం మనలో సంతోషాన్ని తీసేస్తుంది : దావీదు కేవలం నీకు వ్యతిరేకంగా పాపం చేశాను... నా రక్షణ ఆనందం మరలా దయచేయుము అని కీర్తన 51లో దేవుణ్ణి అడిగాడు. పేతురు పాపం చేసినప్పుడు ఎంతో బాధతో ఏడ్చాడు. లూకా 22:62. ✔ మన పాపం దేవునికి ఎంతో బాధపెడుతుంది: 2 సమూ॥ 24 ప్రకారం దావీదు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదును గద్దిస్తూ తాను దేవుని మాటను తృణీకరించాడని, దేవుడిని లెక్క చేయలేదని, యెహోవాను దూషించటానికి ఆయన శత్రువులకు గొప్ప నింద కలుగచేశాడని తెలియచేశాడు.ఆది 6:5 ప్రకారం దేవుడు పాపాన్ని చూసి సంతాపము నొందెను అని చూస్తాము.ఎఫె 4:30 లో విశ్వాసి పాపము చేసినప్పుడు అత్త దేవుడు దుఃఖపడతాడు అని చూస్తాము.❖ మనము పాపంలో పడినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో తెలుసుకోవాలి :హెబ్రీ 4:12-16 వచనాలలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేశాడు. ✔ వాక్యము ద్వారా మనలో ఉన్న పాపాన్ని చూపిస్తాడు : హెబ్రీ 4:12 లో దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించు సంతమట్టుకు దూరుచు , హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చూస్తాము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గంకనుక మనలో చిచ్చు మన రహస్య పాపాలను భయట పెడుతుంది.✔ వాక్యం ద్వారా పాపం వల్ల శిక్ష వుంది అని మనలో భయాన్ని కలుగుచేస్తాడు:హెబ్రీ 4:13 ప్రకారము “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని చూస్తాము. ఈ వచన ప్రకారం మనము దేవుని కళ్ళ నుండి తప్పించుకోలేము అని అర్థం అవుతుంది. దేవునికి మన రహస్య జీవితం అంతా తెలుసు మరియు ఆయన శిక్షిస్తాడు కూడా అని అర్థం అవుతుంది. ఈ వచనము మనలను భయపెడుతుంది.✔వాక్యం ద్వారా దేవుడు మనలను తన కృపా సింహాసనమునకు నడిపిస్తాడు:హెబ్రీ 4:14-16 వచనము మనలను ఎంతో ఆదరిస్తుంది ఎందుకంటే మనలను ఆ పాప శిక్ష నుండి పాప శక్తి నుండి విడిపించటానికి మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మనలను అర్థం చేసుకుంటాడు. మన బలహీనతలు ఆయనకు తెలుసు. ఆయన సింహాసనం కృపా సింహాసనం. అది కఠిన సింహాసనం కాదు. ఆ సింహాసనం వద్ద క్షమాపణ దొరుకుతుంది.యేసు ప్రభువులో పాపం లేదు. ఆయన పాపాన్ని జయించాడు. పాపము నుండి విడుదల పొందటానికి ఆయన సింహాసనం వద్ద మనకు సమయోచితమైన సహాయము ఆయన అనుగ్రహిస్తాడు.1 యోహాను 2:2 లో కూడా ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు అని చూస్తాము.◆ ప్రియ చదువరి,మన బాధ్యత ఏమిటి? దేవుడు మన పాపమును చూపినప్పుడు , పాపం మనలను వెంటాడుతున్నప్పుడు మనము వెంటనే యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృపా సింహాసనం వద్దకు చేరాలి.ఆ ప్రభువు సింహాసనం వద్ద మనకు క్షమాపణ, ఆత్మీయ బలము. ఎంతో నెమ్మది, శాంతి, సంతోషం మరియు ఆత్మీయ మేలు కలుగుతుంది. కాబట్టి మనము ధైర్యంగా ఆ సింహాసనం దగ్గరకు వెళ్లుదాం.
◆ విశ్వాసిని పారుపాటున పాపములో పడితే ఏమి చేయాలి?
ఒక విశ్వాసిని ఎక్కువ బాధపెట్టేది మరియు భయపెట్టేది శరీరానికి తగిలిన గాయం కాదు, ఆస్తి నష్టం కాదు, డబ్బులు పోవటం కాదు, మనుషులు ఒంటరిచేసి విడిచిపెట్టడం కానేకాదు. ఒక విశ్వాసి ఎక్కువ బాధపడేది , బాధపడేది కేవలం తాను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టియే. పాపము వల్ల తాను ప్రేమించిన దేవుని మనస్సును గాయపరిచానని విశ్వాసి ఎక్కువ బాధపడతాడు. మరి అట్టి సమయంలో విశ్వాసి ఏమి చేయాలో రెండు విషయాలు తెలుసుకుందాము
❖ పాపం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకోవాలి...
✔ మన పాపం మనలో సంతోషాన్ని తీసేస్తుంది :
దావీదు కేవలం నీకు వ్యతిరేకంగా పాపం చేశాను... నా రక్షణ ఆనందం మరలా దయచేయుము అని కీర్తన 51లో దేవుణ్ణి అడిగాడు. పేతురు పాపం చేసినప్పుడు
ఎంతో బాధతో ఏడ్చాడు. లూకా 22:62.
✔ మన పాపం దేవునికి ఎంతో బాధపెడుతుంది:
2 సమూ॥ 24 ప్రకారం దావీదు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదును గద్దిస్తూ తాను దేవుని మాటను తృణీకరించాడని, దేవుడిని లెక్క చేయలేదని,
యెహోవాను దూషించటానికి ఆయన శత్రువులకు గొప్ప నింద కలుగచేశాడని తెలియచేశాడు.
ఆది 6:5 ప్రకారం దేవుడు పాపాన్ని చూసి సంతాపము నొందెను అని చూస్తాము.
ఎఫె 4:30 లో విశ్వాసి పాపము చేసినప్పుడు అత్త దేవుడు దుఃఖపడతాడు అని చూస్తాము.
❖ మనము పాపంలో పడినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో తెలుసుకోవాలి :
హెబ్రీ 4:12-16 వచనాలలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేశాడు.
✔ వాక్యము ద్వారా మనలో ఉన్న పాపాన్ని చూపిస్తాడు :
హెబ్రీ 4:12 లో దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా
ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించు సంతమట్టుకు దూరుచు , హృదయముయొక్క
తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చూస్తాము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం
కనుక మనలో చిచ్చు మన రహస్య పాపాలను భయట పెడుతుంది.
✔ వాక్యం ద్వారా పాపం వల్ల శిక్ష వుంది అని మనలో భయాన్ని కలుగుచేస్తాడు:
హెబ్రీ 4:13 ప్రకారము “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది” అని చూస్తాము. ఈ వచన ప్రకారం మనము దేవుని కళ్ళ నుండి తప్పించుకోలేము అని అర్థం అవుతుంది. దేవునికి మన రహస్య జీవితం అంతా తెలుసు మరియు ఆయన శిక్షిస్తాడు కూడా అని అర్థం అవుతుంది. ఈ వచనము మనలను భయపెడుతుంది.
✔వాక్యం ద్వారా దేవుడు మనలను తన కృపా సింహాసనమునకు నడిపిస్తాడు:
హెబ్రీ 4:14-16 వచనము మనలను ఎంతో ఆదరిస్తుంది ఎందుకంటే మనలను ఆ పాప శిక్ష నుండి పాప శక్తి నుండి విడిపించటానికి మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మనలను అర్థం చేసుకుంటాడు. మన బలహీనతలు ఆయనకు తెలుసు. ఆయన సింహాసనం కృపా సింహాసనం. అది కఠిన సింహాసనం కాదు. ఆ సింహాసనం వద్ద క్షమాపణ దొరుకుతుంది.
యేసు ప్రభువులో పాపం లేదు. ఆయన పాపాన్ని జయించాడు. పాపము నుండి విడుదల పొందటానికి ఆయన సింహాసనం వద్ద మనకు సమయోచితమైన సహాయము ఆయన అనుగ్రహిస్తాడు.
1 యోహాను 2:2 లో కూడా ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు అని చూస్తాము.
◆ ప్రియ చదువరి,
మన బాధ్యత ఏమిటి? దేవుడు మన పాపమును చూపినప్పుడు , పాపం మనలను వెంటాడుతున్నప్పుడు మనము వెంటనే యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృపా సింహాసనం వద్దకు చేరాలి.
ఆ ప్రభువు సింహాసనం వద్ద మనకు క్షమాపణ, ఆత్మీయ బలము. ఎంతో నెమ్మది, శాంతి, సంతోషం మరియు ఆత్మీయ మేలు కలుగుతుంది. కాబట్టి మనము ధైర్యంగా ఆ సింహాసనం దగ్గరకు వెళ్లుదాం.